19, జూన్ 2016, ఆదివారం

ఈ శ్రీకృష్ణ రహస్యం
--------------------------
మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ? ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ? ఇవన్నీ ఎందుకు జరగలేదు ? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ? ఇలాంటి ప్రలెన్నో సహజంగానే వస్తాయి.
వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్.. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు.. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు.. శ్రీకృష్ణుడు ఏం అడిగాడు.. ఉద్దవుడు ఏం చెప్పాడో.. చూద్దాం..
ఉద్ధవుడు : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా.., ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?
కృష్ణుడు : ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా.
ఉద్ధవుడు : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?
కృష్ణుడు : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను.
ఉద్ధవుడు : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో , చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?
కృష్ణుడు : ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి.. నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.
అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు. పూజలు గట్రా ఏమీ అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు.. మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం.

10, జూన్ 2016, శుక్రవారం

***** మీ శక్తి మీకు తెలిసా? *****
దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం
*మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి.
*మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
*మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి *ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు.
Approx 528 megapixel lense.
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.

9, జూన్ 2016, గురువారం


                             త్రివిక్రమ్ గారి  ఆశల ఆకాశంలో   వున్న  పిడుగు  పవన్  ? ఎందుకు ? దేనికీ  ?





8, జూన్ 2016, బుధవారం

                                             సర్వంత్రయామి  శ్రీ  భగవాన్  శ్రీ కృష్ణ



6, జూన్ 2016, సోమవారం


తెలుగు సినిమా  ఔనత్యాన్ని ప్రపంచ  దశ దిశలా  వ్యా పింప  చేసిన శ్రీ K . విశ్వనాధ్  గారి  అంతరంగం  శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్  గారితో  తప్పక  వీక్షించండి  


                                                 

5, జూన్ 2016, ఆదివారం

అ ఆ  రివ్యూ -                          

                                              Image result for a aa images

ఫీల్ గుడ్ మూవీ , త్రివిక్రమ్ గారి ప్రతిభకు  నిదర్శనం
  
సమంతా  పరిణీ తి  చెందిన   నటన  కనబరిచింది .

నితిన్  యాక్షన్  పరం గా  పూర్తి  న్యా యం  చేసాడు  

ఆడియో  ఇప్పటికే హిట్టు . MICKEY  J  MAYER   మ్యూజిక్  సూపర్ 


పాత సినిమా  మీనా  కాపీ అంటునారు గాని , కాపీ కాని సినిమాలు మన తెలుగులో  ఏమి వున్నాయి. 



మన తెలుగు హీరోస్ దర్సికులకు  ప్రతిభా  పాటవాలపై నమ్మకం  ఉంచితే  మంచిది. 

వీనుల విందైన   పాటలు  విని  ఆనందించండి  . . . 
 













మహా గోదావరి అభిమానులకు స్వాగతం  సుస్వాగతం

గోదావరి  అందాల్ని కోనసీమ సొగసుల్ని తిలకించండి